ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఘటనకు బాధ్యులైన సభ్యులు, సభ్యులు కానివారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 'అత్యాచార భారత్' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఇంకా, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ భారీ విజయాన్ని సాధించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి