సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో కార్మి కులకి 28% వాటా ఇస్తున్నట్లు ప్రకటిం చారు. లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందనున్నట్లు వెల్లడించారు. గతేడాది అందించిన బోనస్ కన్నా ఈ ఏడాది రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సింగరేణి కాలరీస్ అంశంపై సీఎం కీలక ప్రకటన చేశారు. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైందన్నారు.
సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్
Sep 20 2019 8:10 AM | Updated on Sep 20 2019 8:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement