విద్యా సంవత్సరం ముగిసినా ఇంతవరకు ఏపీ సర్కార్ ఉపాధ్యాయ బదిలీల వ్యవహారంపై ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే చోట విధులు నిర్వహించిన వారికి బదిలీలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆయా టీచర్లను బదిలీ చేయనున్నారు. ఈ బదిలీ ప్రక్రియ మే 5వ తేదీ నుంచి జూన్ 4 వరకు నెల రోజులపాటు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మే 5 నుండి ఉద్యోగుల బదిలీలు
May 2 2018 9:55 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement