టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. | TDP MLA Kuna Ravi Kumar Phone Recording Hulchul In Social Media. | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా పట్టుకో లేదంటే..

Feb 12 2019 7:33 AM | Updated on Mar 22 2024 11:14 AM

ఆయన ఓ ప్రజా ప్రతినిధి. ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తి. చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులో ఆదర్శం, విలువలు చూపించాల్సిన మనిషి. కానీ మన జిల్లా ప్రజా ప్రతినిధి మాత్రం ఆదర్శాలను గాలికి వదిలేశారు. కేవలం నచ్చిన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడనే కక్షతో ఓ సామాన్యుడిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషను ఉపయోగిస్తూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్ప డ్డారు. ఎమ్మెల్యే స్థాయికి తగని మాటలతో విలువలకు నిలువునా పాతరేశారు. గంగిరెడ్ల శివ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ తన పార్టీ జెండా పట్టుకోకుంటే వెంటాడివేటాడుతానని బెదిరించారు. ఆ ఫోన్‌ సంభాషణ సాగిందిలా..

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement