‘ఏంరా.. వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుని.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది ..రుణమాఫీ వస్తే దొబ్బారు.. ఇవన్నీ దొబ్బి .. మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి’అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద విప్పిన బూతు పురాణం ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మాట్లాడాల్సిన మంత్రి ఈ విధంగా అవహేళన చేయడంపై అంతా విస్తుపోయారు.సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో మంత్రి బూతు పురాణం విన్న వారిలో కొంత మంది పగలబడి నవ్వగా.. మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇచ్చారా.. ఇలా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటూ మరికొంతమంది విసుక్కున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
‘అన్నీ దొబ్బి... ఓటెయ్యకపోతే ఊరుకోవద్దు’
Jan 29 2019 8:32 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement