ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే స్వైన్ ప్లూ | Swine flu toll reaches 12 in Kurnool district | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే స్వైన్ ప్లూ

Oct 31 2018 7:23 AM | Updated on Mar 21 2024 6:46 PM

కర్నూలు జిల్లాలో స్వైన్‌ ఫ్లూ విజృంభించడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గల వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే 12 మంది చనిపోగా, మరికొంతమందికి వ్యాధి నిర్దారణ అయింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోందని ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు.  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. మందులు, ప్రత్యేక వార్డులు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement