యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు వెలువరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇదివరకే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్ ప్రకటించింది.
బిగ్ బ్రేకింగ్: రేపే అయోధ్యపై తీర్పు
Nov 8 2019 9:36 PM | Updated on Nov 8 2019 9:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement