కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? | So Many Questions and Doubts on Kodela Siva prasada Rao Death | Sakshi
Sakshi News home page

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

Sep 16 2019 3:39 PM | Updated on Mar 21 2024 11:34 AM

టీడీపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అర్ధంతర మృతి.. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు కథనాలు, వదంతులతో అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారా? లేక మరేదైనా కారణముందా?.. ప్రస్తుతం అందరినీ తొలస్తున్న ప్రశ్నలివే. కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. లేదు, డాక్టర్‌ అయిన కోడెల ప్రమాదకరమైన ఇంజెక‌్షన్‌ చేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. అసలు ఆదివారం రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement