షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై కేసు నమోదు | Shine Childrens Hospital Seized In LB Nagar | Sakshi
Sakshi News home page

షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై కేసు నమోదు

Oct 21 2019 1:01 PM | Updated on Mar 21 2024 8:31 PM

అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎల్బీనగర్‌లోని షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదంతో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ చిన్నారుల్లో ముగ్గురిని ఉప్పల్‌ శ్రద్ధ ఆస్పత్రికి తరలించినా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కూడా తరలించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 42మంది చిన్నారులు ఉన్నారు. అయితే  ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement