నగరంలోని మతుంగ రైల్వే స్టేషన్‌లో మాటువేసి నిర్మానుష్యంగా ఉండే అక్కడి బ్రిడ్జ్‌పైకి మహిళలు రాగానే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం పనిగా పెట్టుకున్న యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసులో పట్టుబడ్డ నిందితుడిని మహిళల పట్ల అనుచితంగా ప్రవరిస్తున్న వ్యక్తిగా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. చోరీ కేసులో గురువారం అరెస్టయిన క్రమంలో అతడి నిర్వాకాన్ని ముంబై పోలీసులు తెలుసుకుని నివ్వెరపోయారు.