విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమెతోపాటు ఇతర దళితులపై గత మంగళవారం దాడికి పాల్పడ్డ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.