కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్‌ అనుభవ రాహిత్యమై ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డ ప్రయాణికులు.. డ్రైవర్‌ను చితక్కొట్టారు. రెండు బస్సులు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top