ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధిత యువతి ప్రేమికుడే.. తన స్నేహితుడిని ఆమెపైకి ఉసిగొల్పి.. అత్యాచారయత్నం చేయించాడు. ఆ ఘటనను స్నేహితులతో కలిసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అంతేకాకుండా అత్యంత కిరాతకంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బాధిత యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధాన నిందితుడు కార్తీక్ సహా అతని స్నేహితులైన పవన్, సాయి, కోటేశ్వరరావు పరారీలో ఉన్నట్టు సమాచారం.