ఏ కలల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో ఆ కలలు నెరవేరడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ సాధనలో ఆత్మబలిదానాలు చేసిన అమరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. సరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్‌ఎస్, ఎన్డీయే ప్రభుత్వాలపై ఆయన ధ్వజమెత్తారు.