టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. పూతల పట్టు నియోజనవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్‌ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు.