నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్ సింగ్ పంజాబ్‌లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సత్పాల్ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్‌కు అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి.
కార్గిల్ యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్‌కు ప్రమోషన్
Jul 27 2019 2:47 PM | Updated on Jul 27 2019 2:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement