విజయవాడ అభివృద్ధే తన ఎజెండా అని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను పుట్టిపెరిగిన విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు.