చంద్రబాబు గుణం ఎలాంటిదో అందరికి తెలుసన్నారు. తక్కువ సమయంలో మామకు వెన్నుపోటు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ హత్యకు చంద్రబాబే కారణమన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో లక్ష్మీపార్వతికి మంచి పేరు వచ్చిందని అందుకే ఆమెపై లైగింక దాడి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘70 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ గురించి అంత ఘోరంగా రాస్తారా? ఎన్టీఆర్ ఇల్లాలు గురించి ఎవరో ఒకరు అలా మాట్లాడితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఊరుకుంటున్నారు? 70ఏళ్ల వయసులో లైంగిక దాడికి పాల్పడుతారా? చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ మహిళను అయినా వాడుకొని వదిలేస్తారు. జయపద్ర, రోజాను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారో అందరికి తెలిసిందే. చిరంజీవీ పార్టీ పెట్టుకుంటే ఆయన ఇంటి ఆడపిల్లల గురించి తిట్టించారు. పవన్ కల్యాణ్ ఈ విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది.