ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవాన్ని స్వీకరించిన అనంతరం జెండానుఎగరేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి, అమరవీరులకు నివాళి అర్పించారు. కాగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఎగరవేయడం ఇది ఆరోసారి. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి