రాష్ట్రంలో తండ్రీ, కొడుకుల (చంద్రబాబు, లోకేశ్) ఆధ్వర్యంలోని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే మట్టి కరిపించనున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. పోలవరం నుంచి అమరావతి వరకు అన్నిటిలోనూ అనేక అక్రమాలతో చంద్రబాబు తన సంపదను పెంచుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో చంద్రబాబు సీనియర్ అని మండిపడ్డారు. కేంద్రం నుంచి తీసుకున్న నిధులకు లెక్కలు అడుగుతుండడంతో ఆయనకు నిద్రపట్టడం లేదన్నారు. ఓటమి భయంతో పాటు చౌకీదార్‌గా ఉన్న నన్ను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే’ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. వివిధ రకాల హావభావాలు, ముక్కుసూటి వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు, ప్రశ్నలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
మీలాంటి సీనియార్టీ నాకు లేదు బాబుగారూ..
Feb 11 2019 7:34 AM | Updated on Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement