ఆమరణ దీక్ష వైపుగా ముందుకెళుతున్న సంగీతను తొలి విజయం వరించింది. మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ఆమెను గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి నెల మెయింటెన్స్‌కు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. బోడుప్పల్‌కు చెందిన సంగీత తన భర్త శ్రీనివాసరెడ్డి వేధింపులపై గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ఈ కేసు విచారణలో భాగంగా మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.