రైలులో సిలిండర్‌ పేలుడు.. 62 మంది మృతి | Pakistan, Several killed in gas canister blast and fire on train | Sakshi
Sakshi News home page

రైలులో సిలిండర్‌ పేలుడు.. 62 మంది మృతి

Oct 31 2019 11:41 AM | Updated on Mar 21 2024 11:38 AM

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గురువారం ఉదయం జరిగిన రైలు అగ్ని ప్రమాదంలో  62 మంది సజీవ దహనమయ్యారు. 13 మంది గాయపడ్డారు. వివరాలు.. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్‌గామ్‌ రైలు లియాకత్‌పూర్‌ నగర సమీపానికి రాగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకురాగా, ఆర్మీ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో గాయడిన క్షతగాత్రులను, మృతదేహాలను  అధికారులు సమీప జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement