పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరితమైన విమర‍్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు. అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
Jun 6 2019 11:49 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement