నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తోపాటుగా పాకిస్తాన్‌ తెహ్రికీ ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత జహంగీర్‌ తరీన్‌ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్‌ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62 (1) (ఎఫ్‌) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top