రూ వందకు పైబడిన భారత కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్ కేంద్ర బ్యాంక్ నిషేధించింది. రూ 2000, రూ 500, రూ 200 నోట్ల వాడకం చెల్లదని బ్యాంక్ పేర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ జారీ చేసిన ఉత్తర్వులు భారత పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూ 100కు మించిన భారత నోట్లతో కూడిన లావాదేవీలు, వాటిని కలిగిఉండటం, ట్రేడింగ్ చేయడం నిషేధిస్తూ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అక్కడి ట్రావెల్ సంస్ధలు, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు సర్క్యులర్ జారీ చేసిందని ఖట్మండు పోస్ట్ పేర్కొంది.