త్రిశూలం ఆకారంలో విన్యాసాలు.. | National Flag Hoisted By President Ramnath Kovind | Sakshi
Sakshi News home page

త్రిశూలం ఆకారంలో విన్యాసాలు..

Jan 26 2019 2:25 PM | Updated on Mar 22 2024 11:23 AM

భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ  సందర్భంగా రాజ్‌పథ్‌ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోస దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ సందర్బంగా ఇండియన్‌ ఆర్మీ 21 గన్‌ సెల్యూట్‌ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన లాన్స్‌ నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వనీకి ప్రకటించిన అశోకచక్ర అవార్డును ఆయన సతీమణికి రాష్ట్రపతి అందజేశారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్‌ త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిద దళాల అధిపతులు నివాళులర్పించి రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement