మనోడు ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు.. | Nagal Took The first Set Off Federer At US Open | Sakshi
Sakshi News home page

మనోడు ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు..

Aug 27 2019 4:01 PM | Updated on Aug 27 2019 4:05 PM

పిన్న వయసులోనే  యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించిన భారత యువ సంచలనం సుమీత్‌ నాగల్‌.. ప్రపంచ మూడో ర్యాంకర్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు.  ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోరులో నాగల్‌ పోరాడి ఓడాడు.  ఇరువురి మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో నాగల్‌ తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే తొలి సెట్‌ను 6-4తో గెలిచి మంచి జోష్‌లో కనిపించాడు. అయితే టెన్నిస్‌ ప్రపంచంలో అసాధారణ ఆటగాడిగా పేరున్న ఫెడరర్‌ అనుభవం ముందు నాగల్‌ చివరకు తలవంచక తప్పలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement