కోమటి రెడ్డి అనుచరుడి దారుణ హత్య | municipal chairperson husband murdered by unknown persons | Sakshi
Sakshi News home page

కోమటి రెడ్డి అనుచరుడి దారుణ హత్య

Jan 25 2018 7:14 AM | Updated on Mar 21 2024 9:02 PM

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీనివాస్‌ తలపై బండరాయితో మోది హత మార్చారు.  ఆయన ఇంటి సమీపంలోనే జరిగిన హత్య నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనివాస్‌ నివాసం ఉంటున్న సావర్కర్‌ నగర్‌లో రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడ్డారు. ఈవిషయంలో స్థానిక కౌన్సిలర్‌ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమనకపోవడంతో గోపీ, శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో బయటకు వచ్చిన శ్రీనివాస్‌ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement