సరదా కోసం ఓ వ్యక్తి పిల్లికూనల్ని విచక్షణా రహితంగా మంటల్లో పడేసి కాల్చాడు. అవి విలవిల్లాడుతుంటే చూసి రాక్షసానందం పొందాడు. ఈ సంఘటన ముంబైలోని నయానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబై భక్తి పార్క్‌కు చెందిన 30 ఏళ్ల సిధ్ధేశ్ పటేల్ ఆదివారం రెండు గంటల ప్రాంతంలో తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్స్ బిల్డింగ్ లాబీలోకి ప్రవేశించాడు. అక్కడ మూడు పిల్లికూనలు నిద్రించి ఉండటం గమనించాడు. అవి హాయిగా నిద్రపోవటం గమనించిన అతడిలో రాక్షసుడు మేల్కొన్నాడు. అవి నిద్రపోయే పరుపుకు నిప్పంటించాడు. అవి పారిపోవటానికి ప్రయత్నించినా వదలకుండా వాటిని నిప్పుల్లో పడేశాడు.
సరదా కోసం పిల్లికూనల్ని దారుణంగా..
May 3 2019 9:36 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement