దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీపై ఉల్లిని అందిస్తున్నామని, ప్రజలు ఇబ్బందులు పడకూడదని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతు బజార్లలో ఉల్లి ధర రూ, 45 ఉండగా, ఏపీ రాష్ట్ర ప్రజలకు కిలో ఉల్లి రూ. 25కే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని అధిక ధరకు కొని రాష్ట్ర ప్రజలకు సబ్సిడీ కింద తక్కువ ధరకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నూలు, రాజస్థాన్ నుంచి కిలో రూ.120 కొనుగోలు చేసి ఏపీ మార్కెట్లలో రూ.25కు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఉల్లి ధరల విషయంలో మొదటగా స్పందించిన రాష్ట్రం ఏపీనే అని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉల్లిపై సబ్సిడీ
Dec 9 2019 4:09 PM | Updated on Dec 9 2019 5:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement