ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి సోమవారం (నేడు) కలవబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిరంజీవి మధ్యాహ్నం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకుంటారు. ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.