తిరుపతి : లాక్‌డౌన్ కారణంగా కనీస వసతులు లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని లాంక్యో ఫ్యాక్టరీ కార్మికులు ధర్నాకు దిగారు. దాదాపు రెండు వేల మంది వలస కార్మికులు శనివారం సాయంత్రం ఫ్యాక్టరీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమను స్వంత రాష్టాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేదని వలస కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బొజ్జల అనుచరులు తమను వేధిస్తున్నారని, వారే యూనియన్ నాయకులుగా వుంటూ అరాచకం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించని తమను స్వరాష్ట్రం పంపిచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో కనీస సదుపాయాలు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు.
లాక్‌డౌన్: ల్యాంకో ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
May 9 2020 6:57 PM | Updated on May 9 2020 7:03 PM
Advertisement
Advertisement
Advertisement
