దెబ్బకు ట్రక్కు వంద ముక్కలైంది.. | Lexus slams into, destroys truck on Canadian highway | Sakshi
Sakshi News home page

దెబ్బకు ట్రక్కు వంద ముక్కలైంది.

Aug 8 2018 7:31 PM | Updated on Mar 21 2024 7:52 PM

అదృష్టం బాగుంటే సింహం బోనులో అడుగుపెట్టి దర్జాగా తిరిగి బయటకురావచ్చంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే కెనడాలో చోటుచేసుకుంది. రోడ్డుపై రీపేర్ల నిమిత్తం ఆపిన ఓ ట్రక్కును వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఆ వేగానికి ట్రక్కు ముక్కలు ముక్కలు అయినా కూడా దాన్ని రిపేర్‌ చేస్తున్న వారికి మాత్రం ఏమీ కాలేదు. కేవలం చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టోరంటో హైవేపై ఓ ట్రక్కు రిపేర్ల కోసం ఆగింది. ఓవ్యక్తి ఆ వాహనాన్ని రిపేర్‌ చేసే పనిలో బిజిగా ఉన్నాడు. రోడ్డుపై వాహనం ఆగిపోవటం వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి అక్కడ ఓ జెండాను ఎగరేశారు.కొద్దిసేపటి తర్వాత ఓ తెల్లకారు వేగంగా ట్రక్కువైపు దూసుకు వచ్చింది. కారు వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టింది దీంతో ట్రక్కు ముక్కలు ముక్కలుగా అయ్యి ఎగిరిపడింది. దాన్ని రిపేర్‌ చేస్తున్న వ్యక్తి, లోపల ఉన్న మరికొందరు అంతా ఎగిరిపడ్డారు. అయినా వారికి పెద్ద గాయాలేమీ కాలేదు.. చిన్న చిన్న గాయలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు.. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement