టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ఫ్లకార్డులు, పోస్టర్‌లతో దౌర్జన్యంగా లోనికి వచ్చేందుకు యత్నించారని మంత్రి తెలిపారు. చంద్రబాబే మార్షల్స్‌ను తోసుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి అని విమర్శించారు. టీడీపీలోకి అడ్డగోలుగా చొరబడి.. ఆ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.