ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ ప్రచార పర్వం మొదలవుతోంది. టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు పాల్గొనే తదుపరి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు.