విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు | Kashmiri Youth Dies In Jaipur Hospital After Beaten By Colleagues | Sakshi
Sakshi News home page

విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు

Feb 7 2020 8:01 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఆటోలో సీటు కోసం గొడవ పడి ఒక కశ్మీరీ యువకుడు తన ప్రాణం పోగొట్టుకొన్న విషాద ఘటన జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల బసిత్‌ జైపూర్‌ ప్రాంతంలో క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బసిత్‌ ఫిబ్రవరి 5న అర్ధరాత్రి సమయంలో తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకు కోవర్కర్లతో కలిసి బయలుదేరాడు. కొద్దిసేపటికి రూంకు వచ్చిన బసిత్‌ను గాయాలతో చూసిన అతని స్నేహితులు జైపూర్‌లోని సవాయి మాన్‌ సింగ్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement