ఏపీలో సమ్మె విరమించిన జూడాలు | Junior doctors in Andhra Pradesh call off Strike | Sakshi
Sakshi News home page

ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

Aug 9 2019 2:04 PM | Updated on Aug 9 2019 2:09 PM

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్‌లు సమ్మె విరమించారు. ప్రభుత్వ చొరవతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎమ్‌సీ) బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా జూడాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్‌ డాక్టర్స్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జూడాలు జరిపిన చర్చల సఫలం అయ్యాయి. జూడాలు తమ వద్ద ప్రస్తావించిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement