‘నేను చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండేది. ఆరోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్ ఉన్న సీఎం ఆయన’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సాక్షి టీవీ స్పెషల్ లైవ్ షోలో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో ఆయన మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు.