జయహో జెండా పండుగ | India showcases military might, cultural diversity | Sakshi
Sakshi News home page

Jan 27 2018 8:10 AM | Updated on Mar 20 2024 1:57 PM

భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్‌ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్‌ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు,  ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా  కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక.

Advertisement
 
Advertisement
Advertisement