భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు | Huge Raise In AP CM Chandrababu Naidu And His Son Lokesh Assets | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు

Mar 22 2019 8:31 PM | Updated on Mar 22 2024 11:29 AM

కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు తరఫున స్థానిక టీడీపీ నేతలు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ఆస్తుల్లో స్థిర ఆస్తి విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు, చరాస్తుల విలువ 47 లక్షల 38 వేల రూపాయలని తెలిపారు. ఇక తన సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ రూ. 574 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు.. స్థిరాస్తుల విలువ 95 కోట్ల రూపాయలని వెల్లడించారు. కాగా 2014 ఎన్నికల సందర్భంగా.. చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్ల రూపాయలుగా చూపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement