అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. తదుపరి ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి.
అభిశంసనకు గురైన ట్రంప్
Dec 19 2019 8:01 AM | Updated on Mar 20 2024 5:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement