అన్నా క్యాంటీన్‌లో వ్యభిచార బాగోతం!

అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్‌లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం  ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్‌లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా శనివారం రాత్రి వాచ్‌మెన్‌ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు.అన్నా క్యాంటీన్‌ మేనేజర్‌ కృష్ణా, వాచ్‌మెన్‌ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top