హైకోర్టులో నవయుగకు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మచిలీపట్నం(బందరు) పోర్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దుపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే పోర్టు నిర్మాణం కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించవచ్చని తెలిపింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి