సాక్షి, విజయవాడ: అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది .ప్రధాన రహదారులు జలమయమయ్యాయి .చిన్నపాటి చెరువులను తలపించాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయం కాగా, ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ వాటర్‌తో కలిసి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయటంతో వాహన చోదకులు ,పాదచారులు నానా అవస్థలు పడ్డారు. సైలెన్సర్లు నీట మునగటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయించాయి. ఇక డ్రైనేజ్ నీళ్లు, వర్షం నీటితో కలిపి రోడ్లపైకి వచ్చేయడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
తడిసి ముద్దయిన బెజవాడ
Sep 17 2019 5:04 PM | Updated on Sep 17 2019 5:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement