కలెక్టర్‌పై వైద్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు | Guntur: Doctor Somulu Fires On Guntur Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌పై వైద్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు

Sep 10 2020 8:20 PM | Updated on Mar 21 2024 7:59 PM

సాక్షి, గుంటూరు : నరసరావుపేట కరోనా వైరస్‌పై కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అధికారులు సరైన విధంగా విధులు నిర్వర్తించడంలేనది మందలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ తీరుపై నాదెండ్ల ప్రభుత్వ వైద్యుడు సోములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తనకు చెప్పందేంకు నువ్వెవరివంటూ విధుల్లో ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించాడు. డాక్టర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ వెంటనే అతన్ని అరెస్ట్‌ చేయాలని పోలీసులను అదేశించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement