స్పా సీలింగ్‌లో 20 కిలోల కొండచిలువ | Giant Python Falls Through Spa's Ceiling in China | Sakshi
Sakshi News home page

స్పా సీలింగ్‌లో 20 కిలోల కొండచిలువ

Nov 20 2019 1:01 PM | Updated on Nov 20 2019 1:06 PM

సాధారణంగా ఆఫీసుల్లో, షాపింగ్‌ మాల్స్‌లో‌, సెలూన్స్‌ వంటి వాటిలో ఎలుకలు ఉండటం, గోడలపై బల్లులు తిరగటం సహజమైన విషయమే. అయితే చైనాలోని ఓ స్పా  యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్‌ సీలింగ్‌ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పామును పట్టుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement