ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి జరిగింది. ప్రచారంలో భాగంగా దిల్లీలోని మోతీనగర్ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రోడ్ షోలో మాట్లాడుతున్న కేజ్రీవాల్ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి చెంప చెల్లుమనిపించాడు.