రాష్ట్రంలో ఒకవైపు మాఫియా ప్రకృతి వనరులను కొల్లగొడుతుంటే, మరోవైపు వేటగాళ్లు వణ్యప్రాణును హరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయిన చిరుతపులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పీలేరు మండలం తలుపుల గ్రామపంచాయితీ పరిధిలోని సళ్లవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో మరణించిన చిరుత పులిని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఉచ్చులోపడ్డ చిరుతను చంపి, దాని కాలిగోర్లను కత్తిరించి, కళేబరాన్ని ఓ గుంతలో విసిరేసి వెళ్లారు. చనిపోయిన చిరుత వయసు సుమారు ఎనిమిదేళ్లు ఉండొచ్చని అధికారులు చెప్పారు.