రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు విషయాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు వెల్లడించారు. ప్రియాంకారెడ్డిని పక్కా పథకం ప్రకారమే ట్రాప్ చేసి అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేశారని తెలిపారు. నిందితులు మహ్మద్ ఆరీఫ్ ఏ1 (26), శివ ఏ2 ( 20) నవీన్ ఏ3 (20) కేశవులు ఏ4 (20) కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడిస్తూ.. ‘ప్రియాంక స్కూటీని టోల్‌ప్లాజా పక్కన పార్క్ చేయడం ఈ నలుగురు చూశారు. సాయంత్రం బైక్ తీసుకుపోవడానికి వస్తుందని మాటువేశారు. ఆమెపై ఎలానైనా అత్యాచారం జరపాలని పథకం రచించారు. శివ అనే వ్యక్తి దీనికి ప్రణాళికను రూపొందించారు. దానిలో భాగంగానే ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నవీన్ బైక్ పంక్చర్ చేశాడు.