తెలంగాణలో 77కు చేరిన కరోనా కేసులు | Corona Positive Cases Rises To 77 In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 77కు చేరిన కరోనా కేసులు

Mar 30 2020 11:04 PM | Updated on Mar 21 2024 11:40 AM

తెలంగాణలో సోమవారం మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. నేడు 13 మందిని డిశ్చార్జ్‌ చేసినట్టు తెలిపింది. ఇదివరకే డిశ్చార్జ్‌ అయిన వ్యక్తితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 14 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు చెప్పింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 61 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement